నిరుద్యోగులకు శుభవార్త.. వయో పరిమితి 44 ఏళ్ళకు పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
యూనిఫాం సర్వీసుల్లోనూ రెండేళ్ళు పెంపు
ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం గరిష్ట పరిమితిని 34 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫారం సర్వీసులకు కూడా సాధారణ కేటగిరిలో వయోపరిమితిని రెండేళ్ల పాటు పెంపుదల చేసింది. రిజర్వ్ డ్ కేటగిరీలకు ఇపుడు వర్తించే సడలింపులు కొనసాగుతాయి.. వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వయో పరిమితి పెంపుదల అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
