నేడు పెన్షన్ల పంపిణీ
రూ.1563.73 కోట్ల విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1న డాక్టర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వృద్ధులు, వికలాంగులతో పాటు వివిధ సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేందుకు రూ.1563.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.51 లక్షల మంది పెన్షనర్లకు 2.66 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ను అందించనున్నారు. అయిదురోజుల్లో నూటికి నూరు శాతం పంపిణీని లక్ష్యంగా నిర్ణయించినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీని నిరంతరం డిఆర్డిఎ కాల్సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. లబ్దిదారుల గుర్తింపునకు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు వెల్లడించారు.