కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే బనకచర్ల

ధ్వజమెత్తిన ఏబీ వెంకటేశ్వరరావు
రాయలసీమ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏబీ బృందం
పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కొరకే తప్ప ఇది రాయలసీమకు ఏమాత్రం లబ్ది చేకూరదని ఆలోచనాపరులు వేదిక నాయకులు విశ్రాంత ఐపియస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. రాయలసీమలో ప్రాజెక్టులు, నీటి లభ్యత క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకోవడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, తెలుగుగంగ ప్రాజెక్టులను సందర్శించడమైనది. ఈ సందర్భంగా బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి, సాగునీటి రంగ విశ్లేషకులు తుంగ లక్ష్మినారాయణ, రైతుసేవా అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్, సామాజికవేత్త జొన్నాలగడ్డ రామారావు, CPI నాయకులు రామాంజనేయులు రైతు నాయకులు పాల్గొన్నారు.