రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించిన ఏబీ వెంకటేశ్వరరావు
ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపియస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు మంగళవారం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించారు. మల్యాల ఎత్తిపోతల పథకం (హంద్రీనీవా), ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బనకచర్ల, తెలుగుగంగ ప్రాజెక్డులను సందర్శించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్హా దశరథరామిరెడ్డితో పాటు సీపీఐ నాయకుడు రామాంజనేయులు, రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్, సాగునీటి రంగ విశ్లేషకుడు తుంగ లక్ష్మినారాయణ, సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావు తదితరులతో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టులను పరిశీలించారు. బుధవారం మరికొన్ని ప్రాజెక్టులను పరిశీలించి కర్నూలులో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.
