Prakasam

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

ఒంగోలులో ప్రచారం నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

ఒంగోలులో AIFTU (న్యూ),  రైతు కూలీ సంఘం (ఆంధ్ర ప్రదేశ్) ప్రచారం

ఈనెల 12న నిర్వహించనున్న  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా వివిధ పరిశ్రమల లోని కార్మిక వర్గానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ AIFTU (న్యూ),  రైతు కూలీ సంఘం (ఆంధ్ర ప్రదేశ్) ఆధ్వర్యంలో ఈమనిపాలెం కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్, అంబేద్కర్ బొమ్మ, చర్చి సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరిగిన సభలో ఏఐఎఫ్టియు (న్యూ) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎం ఎస్ సాయి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో ఉంచాలని, సంఘం పెట్టుకునే హక్కు రద్దు చేయరాదని, కాంట్రాక్టు ,ఫిక్స్ టైం ఎంప్లాయిమెంట్ ను రద్దు రద్దు చేయాలని మాట్లాడారు. ఏఐఎఫ్టియు (న్యూ) జిల్లా నాయకులు కామ్రేడ్ ఇండ్ల విజయ సారధి మాట్లాడుతూ విదేశీ పెట్టుబడిదారుల ఆదేశాల మేరకు కార్మిక చట్టాలను మార్చారని, పని గంటలు 12 గంటల వరకు పెంచడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ లలిత కుమారి మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ,వి బి జి రామ్ జి ఉపాధి చట్టాన్ని రద్దుచేసి పాత మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్స్ తో 12 తేదీన జరుగు సమ్మెలో కార్మిక వర్గం ,రైతాంగం, మేధావులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రదర్శనలో ఏఐఎఫ్టియు (న్యూ) నాయకులు కామ్రేడ్ కత్తి పేరయ్య, సుల్తాన్ భాష, రైతు కూలీ సంఘం (ఆంధ్ర ప్రదేశ్) జిల్లా నాయకులు కామ్రేడ్ పరిటాల కోటేశ్వరరావు, కోడూరు కోటేశ్వరరావు, శ్రీరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *