ap news

పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో ఘనంగా జరిగింది. ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు గార్ల నాయకత్వంలో జిల్లా నాయకులు కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో వున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా॥ జి. లక్ష్మీశను కలిసి జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం, మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల అవార్డులను ప్రధానం, రాష్ట్ర కేంద్రంలో వృద్ధ జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హెూం నిర్మాణం తదితర అంశాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కలెక్టర్ ను కోరారు.

జాయింట్ డైరెక్టర్ కిరణ కుమార్ కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ఆ తర్వాత రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందుబాటులో వున్న అడిషనల్ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత గారికి, జాయింట్ డైరెక్టర్ కిరణ కుమార్ గారికి వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కృష్ణాజిల్లా మాజీ కార్యదర్శి ఖాజావలి, రాజు, చొప్పా రాఘవేంద్రశేఖర్, వైడి. ఆనంద్, మైలవరం నియోజకవర్గ నాయకులు షేక్ సల్మాన్, వీసం సురేష్ బాబు, అవుటి బాబు, మురళి, పల్లెటి కాంతారావు, చింతకాయల రాంబాబు, మంతెన శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *