ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం
- శ్రీ వాసవి మాత సాక్షిగా ఏపీ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం
- ఏపీ రాష్ట్ర కన్వీనర్ గా కలంకౌంటర్ దినపత్రిక అధినేత సిహెచ్ రవికుమార్
- కో కన్వీనర్లు గా దేవతి భగవాన్ నారాయణ, భవిరిశెట్టి రామారావు,ఓబుల శెట్టి రాధాకృష్ణ, డాక్టర్ చక్కా వెంకట కేశవరావు,జి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యుల జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కలం యోధుడు, కలంకౌంటర్ దినపత్రిక అధినేత సిహెచ్ రవికుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్య జర్నలిస్టులు సుమారు 200 మంది హాజరయ్యారు.
శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మండపము నందు ఏర్పాటుచేసిన సభా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసి, వాసవి మాత చిత్రపటానికి పూలమాలవేసి సభను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో అందరూ కలిసి రాష్ట్ర కన్వీనర్ గా సిహెచ్ రవికుమార్ ను, కో కన్వీనర్లుగా మంగళగిరి కి చెందిన దేవతి భగవన్ నారాయణ ను, పల్నాడు జిల్లాకు చెందిన భవిరిశెట్టి రామారావు ను, ప్రకాశంజిల్లాకు చెందిన ఓబులశెట్టి రాధాకృష్ణను, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ చక్కా వెంకట కేశవరావు ను వైజాగ్ జిల్లాకు చెందిన జి శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టులందరూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఒక వేదిక మీదకు రావడం రాష్ట్ర చరిత్రలో శుభపరిణామం అని అన్నారు. తనను రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి ఆర్యవైశ్య పెద్దల ఆశీస్సులతో, అందరి సహాయ సహకారంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం సేవ చేయడానికి తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు
దేవతి భగవాన్ నారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య జర్నలిస్టులు అందరూ ఒక వేదిక మీదకి రావడం శుభ సూచకమని అన్నారు. ఆర్యవైశ్యు జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు
రాధాకృష్ణ మాట్లాడుతూ తనను రాష్ట్ర కో కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమానికి తాను కృషి చేస్తానని, ఆర్యవైశ్య జర్నలిస్టులందరూ ఒకచోట కలవడం పండుగ వాతావరణం సంతరించుకుంది అని అన్నారు
జి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య జర్నలిస్టులందరూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మన సంస్థకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. తనను కో కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
రామారావు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఆర్యవైశ్య జర్నలిస్టులలో చైతన్యం రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. తనను కో కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
డా. కేశవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అంటే సామాజిక సేవకులని అటువంటి సామాజిక సేవకులే జర్నలిస్టులు అయితే సమాజానికి, ఆర్యవైశ్యులకు ఇంకా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. తనను కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లాల ఆర్యవైశ్య జర్నలిస్టులు తమ తమ అనుభవాలను, వారి ద్వారా సమాజానికి చేసిన సేవలను అందరితో పంచుకున్నారు.
అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులందరూ రవి కుమారును ఘనంగా సన్మానించారు. కోక్ కన్వీనర్లుగా ఎన్నికైన వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.