కరేడు భూములను కాపాడుకుందాం
ఏపీ రైతుసంఘాల సమన్వయ సమితి పిలుపు
విజయవాడ: అన్ని రకాల పంటలు పండే సారవంతమైన కరేడు భూములను కాపాడుకుందామని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతుల పోరాట ఫలితంగా దేశంలోని పంజాబ్ హర్యానా, కర్ణాటక రైతులు విజయం సాధించారని హార్షం వ్యక్తం చేశారు. రైతుల పోరాటాలకి ప్రభుత్వాలు తలగ్గొయని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే 11% సుంఖాన్ని రద్దు చేసిన జిఓను ఉపసంహ రించాలని డిమాండ్ చేశారు.
ఇవీ .. తీర్మానాలు
పత్తి సుంకాలు రధ్దు సమస్యపై కరపత్ర ప్రచారం, గ్రామాలలో సమావేశాలు, సభలు నిర్వహించి తీర్మానం చేసి ప్రధాన మంత్రికి పంపాలని రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. కరేడు భూముల సాధన సమితి కన్వీనర్ యం శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల పంటల పండే, సారవంతమైన భూములైన కరేడు భూములను రైతులు గ్రామస్తులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించిన ఎదుర్కొంటామన్నారు. ప్రాణాల సైతం ఫణంగా పెట్టి భూములు కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం భూసేకరణ ఆపేయాలని కోరారు. లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు పలు తీర్మానాలు చేశారు. పంజాబ్ రైతులు ల్యాండ్ ఫూలింగ్ లో 65 వేల ఎకరాలన్ని తీసుకోవద్దని రైతాంగం తిరగబడ్డారు. ఫలితంగా ప్రభుత్వం వెనక తగ్గిందని, పోరాడిన రైతాంగాన్ని కొనియాడుతూ తీర్మానం చేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో 1,777 ఎకరాల భూ సేకరణను కర్ణాటక రాజ్య సమితి సంయుక్తంగా రైతాంగం పోరాడి ప్రభుత్వాన్ని మెడలు వంచారని ఏపీ రైతు సంఘాల సమావేశం అభినందించింది. హర్యానా ప్రభుత్వం తలపెట్టిన 35,500 భూసేకరణను అక్కడ రైతాంగం తిరస్కరించారు. పలు ఆందోళనలు, పోరాటాలు ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వారిని కూడా ఏపీ రైతు సంఘాలు అభివనందించాయి. మన రాష్ట్రంలో నెల్లూరుజిల్లా కరేడులో ఇండోసోల్ సోలార్ ఎనర్జీ కంపెనీకి 8,360 ఎకరాలు భూ సేకరణ చేయటాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చేపూరు, రావూరు గ్రామాలలో బిపిసిఎల్ కంపెనీకి 6,000 ఎకరాలు సమీకరించటాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతి రాజధాని పేరుతో గతంలో సేకరించిన 33,600 ఎకరాలు, ఇతర భూములు కలిపి 54,000 ఎకరాలు పూర్తిగా అభివృద్ధి పరచకుండా, నిర్మాణాలు పూర్తిగా కాకుండా మరలా 44,000 ఎకరాలు ల్యాండ్ ఫూలింగ్లో తీసుకోవాలని చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని రైతు సంఘాలు నిర్ణయం చేశాయి. అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జ్ పార్కులో 8,844 ఎకరాలు, కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 13,875 ఎకరాలు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట లో జిందాల్ అల్యూమినియం కంపెనీకి 1000 ఎకరాలు భూ సేకరణ చేయటానికి చేసే ప్రయత్నాల్ని విరమించుకోవాలని తీర్మానించారు. సోలార్ విద్యుత్తు, సోలార్ పార్కులు, కంప్రెసర్ బయోగ్యాస్(సిబిజి) పలు కంపెనీలకి 10 లక్షలు ఎకరాలు భూ సమీకరించాలని, అంబానీ కంపెనీకి కేటాయించాలని చేసే ప్రయత్నాలు కూడా ఉపసంహరించుకోవాలని, వారికి న్యాయమైన భూముల కేటాయించాలని భావిస్తే పంట యోగ్యం కానీ నిరుపయోగమైన భూములు సేకరించి ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, వి కృష్ణయ్య, డి హరినాథ్, డాక్టర్ కొల్లా రాజమోహన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లలిత కుమారి, వసుంధర, యం సూర్యనారాయణ, శ్రీ కుమార్, వి రాజశేఖర్ రెడ్డి, కె బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.