పీహెచ్ సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్దo
సీఎంతో చర్చిస్తా…విధుల్లో చేరండి
మంత్రి సత్యకుమార్ యాదవ్
పీహెచ్ సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆమోదయోగ్యమైన డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.
పీజీ ఇన్ సర్వీస్ కోటా కింద 15 శాతం సీట్లను అన్ని స్పెషాల్టీల్లో 2029-30 విద్యా సంవత్సరం వరకు కొనసాగించాలని, టైం బౌండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చాలని, ఆసుపత్రులకు దూరంగా ఉంటూ.. గత నెల 28 నుంచి పీహెచ్సీ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులతో శనివారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు.
కమిటీ 103 పోస్టులే అవసరమని చెప్పినప్పటికీ…
తాజా పరిణామాలపై మంత్రికి అధికారులు వివరించిన ప్రకారం పీజీ ఇన్ సర్వీస్ కోటా అమలు ఎలా ఉండాలన్నదానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ 2025-26 సంవత్సరానికి సంబంధించి బోధానాసుపత్రుల్లో 100 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిథిలో 3 మాత్రమే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రకారం 103 పోస్టులకు సంబంధించి మాత్రమే ఇన్ సర్వీస్ కోటా ఈ ఏడాదికి అమలు చేయాలి. కానీ, వైద్యుల సంఘం విజ్ఞప్తి మేరకు ఉదారంగా వ్యవహరించినందున 190 మంది ఇన్ సర్వీస్ కోటాలో సీట్లు పొందుతున్నారు
ప్రస్తుత గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది నవంబరులో 327 మంది, 2026 నవంబరులో 450 మంది, 2027 నవంబరులో 312 మంది చొప్పున ఇప్పటికే చదువుతున్న పీజీ (పీహెచ్సీ వైద్యులు)లు విధుల్లోకి వస్తారు. వాస్తవానికి జీరో వేకన్సీ విధానంలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీచేస్తున్నందున ఖాళీలుండడంలేదు అని వివరంచారు
సీఎంతో చర్చిస్తా..
పీహెచ్సీ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలి. in సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించాలని కృతనిశ్చయంతో ఉంది. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి చర్చించి, ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీ వేశాం. అని వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్యులకు తెలియ చేశారు