అరవింద్ బాబుపై దాడి చేయలేదు
టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేయటం తగదు
నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్
నరసరావుపేట టీడీపీ నాయకుడు అరవింద బాబు ను పోలీసులు కొట్టారని చెప్పటంలో వాస్తవం లేదని నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. రెండు రోజుల క్రితం జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైందని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టి,సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వారిని వదిలేయాలంటూ టీడీపీ నాయకులు జొన్నలగడ్డ గ్రామములో రోడ్డుపై అడ్డంగా భైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది..రోడ్డును ఖాళీచేయమని టీడీపీ నాయకులను రెండు గంటల పాటు వేడుకున్నాం..అయినా వినలేదు.. వీరి ధర్నా వల్ల సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడ్డారు..ఈ నేపథ్యంలో వారిని అక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నించగా అరవింద్ బాబుతో పాటు ఇతర టిడిపి నేతలు పోలీసులను తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు పోలీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని విజయభాస్కర్ తెలిపారు. అరవింద్ బాబుని పోలీసులు కొట్టారని తప్పుడు ప్రచారం చేయటం ఆ పార్టీ నేతలకు తగదన్నారు. .15 రోజుల క్రితం దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి. తారకరామారావు విగ్రహ ధ్వంసానికి యత్నించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం..తమకు ఏ పార్టీ అయినా ఒకటే.. పోలీసులకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు ఉండవన్నారు. విధి నిర్వహణలో కఠినంగా ఉంటాం.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తాం..ఈ నేపథ్యంలో ప్రజలు వాస్తవాలను గ్రహించాలని విజయభాస్కర్ కోరారు.