మాగుంట ఇంటికి దామచర్ల
మాగుంట సుధాకర్ రెడ్డి చిత్ర పటానికి నివాళి
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెళ్ళారు. ఇటీవల మృతి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి సోదరుడు మాగుంట సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తన ఇంటికి వచ్చిన దామచర్లను మాగుంట ఆత్మీయంగా పలకరించారు. సోదరుని మరణంతో దు:ఖంలో ఉన్న మాగుంటకు దామచర్ల సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తన సోదరునితో ఉన్న అనుబంధాన్ని మాగుంట గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట, దామచర్ల కొద్ది సేపు మాట్లాడుకున్నారు.