అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
- “ఇదేం ఖర్మ…. రాష్ట్రానికి” అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు
వెనుకబడిన చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకన్నా ఏపీ ఆర్ధికపరిస్థితి హీనం - బుర్రకథలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మంత్రి బుగ్గన
ఈశాన్య, కరువు రాష్ట్రాల సరసన ఏపీని నిలిపిన జగన్ రెడ్డి - టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- ఈ ఏడాది మొదటి ఏడున్నర నెలల్లోనే ఒక్క ఆర్.బి.ఐ నుంచి రూ.43,803 కోట్ల భారీ అప్పు రాష్ట్రం చేసింది.
ఆర్.బీ.ఐ సమాచారానికి జగన్ రెడ్డి, బుగ్గన ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఢిల్లీ వీధుల్లో బొచ్చె పట్టుకుని తిరుగుతూ బిజీగా కనిపించే ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. యథావిధిగా ఎప్పటిలాగానే బుర్ర కథల, పిట్టకథలు చెప్పే బురిడీ బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా ముందుకు పచ్చి అబద్దాలే వల్లె వేశారు. బుర్రకథలు చెప్పడం, బురిడీ కొట్టించడంలో తనను మించిన వారు లేరని బుగ్గన అనుకుంటూ చివరకు బఫూన్ బుగ్గనలా మారారు. ఇప్పటికైనా బుగ్గన అబద్దాలు చెప్పడం మాని తాను ఒక బాధ్యతగల మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఈమధ్యనే కాగ్ నివేదికలో అప్పుల్లో మనమే నంబర్ వన్ అని తేలిపోయింది. దానికి అధనంగా ప్రతి మంగళవారం ఆర్ బీ ఐ గడప వద్దకు భారీ బొచ్చె పట్టుకుని వెళ్లే కార్యక్రమంలో కూడా మనమే ముందున్నామని నేడు ఆర్.బి.ఐ లెక్కలతో స్పష్టమైంది.
2022-2023ఆ ర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్-1 నుండి నవంబర్-15 వరకు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పులు తీసుకునే విధానం ప్రకారం ఆర్.బీ.ఐ వద్ద అత్యధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ముందు ఉంది అని నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగాను. వాళ్లు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆర్.బీ.ఐ నుండి అప్పులు అత్యధికంగా తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రూ.43,803 కోట్ల అప్పులు చేసి ముందంజలో ఉంది. ఇది వివిధ కార్పొరేషన్లు, లిక్కర్ బాండ్ల ద్వారా చేసిన అప్పులను జత చేయకుండా చేసిన మొత్తం. ఒక్క మహారాష్ట్ర మాత్రమే మనకంటే ఒక వెయ్యి కోట్లు అధనంగా ఆర్.బి.ఐ నుంచి అప్పు చేసింది.
ఆర్.బి.ఐ వారు ఇచ్చిన సమాచారం మేరకు వివిధ రాష్ట్రాలు వారి వద్ద తీసుకున్న అప్పుల వివరాలు…
రాష్ట్రం చేసిన అప్పు (రూ.కోట్లలో)
ఆంధ్రప్రదేశ్ 43,803
తమిళనాడు 41,000
పశ్చిమబెంగాల్ 30,000
పంజాబ్ 27,955
రాజస్థాన్ 25,500
తెలంగాణ 24,500
హర్యానా 23,500
గుజరాత్ 22,500
బీహార్ 17,000
ఉత్తర్ ప్రదేశ్ 14,000
కేరళ 12,436
మధ్య ప్రదేశ్ 12,000
అస్సాం 11,300
కర్నాటక 4,000
జమ్మూ,కాశ్మీర్ 3,550
ఝార్ఖండ్ 1000
నాగాలాండ్ 1,022
మిజోరాం 840
మణిపూర్ 750
మేఘాలయా 600
గోవా 600
ఉత్తరాఖండ్ 500
పాండిచ్చేరి 400
చత్తీస్ ఘడ్ 0.00
అరుణాచల్ ప్రదేశ్ 0.00
త్రిపుర 0.00
ఒరిస్సా 0.00