మెగాస్టార్ కు అరుదైన పురస్కారం
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక
మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం అరుదైన పురస్కారం కోసం ఎంపిక చేసింది. 2022 సంవత్సరానికి గాను భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగిన నటునిగా (ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనను ఎంపిక చేసి పురస్కారం అందిస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రస్తుతం గోవాలో నిర్వహిస్తున్న చలన చిత్రోత్సవ వేడుకల్లో ఆయన పురస్కారం అందుకోనున్నారు. అరుదైన పురస్కారానికి ఎంపికైన చిరంజీవికి సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.