ఢిల్లీ లిక్కర్ స్కాం..కవితను విచారించిన సీబీఐ
ఢిల్లీ లిక్కం స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత తో సీబీణ విచారణ పూర్తయింది. హైదరబాద్ లోని ఆమె ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం సుమారు 7.30 గంటల పాటు విచారణ చేసింది. సీఆర్పీసీ 161 కింది నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు లిక్కం స్కామ్ లో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో అవసరమైతే మరోసారి ఆమెను విచారించే అవకాశమున్నట్టు ప్రచారం కొనసాగుతుంది. కవిత విచారణకు సంబంధించ సీబీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సీబీఐ విచారణ అనంతరం కవితతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భేటీ అయ్యారు. అనంతరం ప్రగతి భవన్ కు వెళ్ళి సీఎం కేసీఆర్ ను కలిశారు. సుమారు 45 నిముషాల పాటు తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన కవిత సీబీఐ విచారణాంశాలన్నిటినీ వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటి వద్ద, ప్రగతి భవన్ వద్ద బీఆర్ ఎస్ కార్యకర్తల హడావిడి కనిపించింది. విచారణ అనంతరం కార్యకర్తలకు కవిత అభివాదం చేశారు.