సీఎంకు కాలు నొప్పి
నేడు ఒంటిమిట్ట పర్యటన రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలి నొప్పితో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరిగింది. గతంలోనూ ఇలాగే కాలు నొప్పి చేసి చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. ఈ నేపత్యంలో ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచించారు. దీంతో ఈనెల 5న ఒంటిమిట్టలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణానికి హాజరై తలంబ్రాలు సమర్పించే కార్యక్రమం రద్దయినట్టు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.