ap news

కంతేరు దళితులపై కేసులు ఎత్తివేయాలి

దాడిచేసిన వారిని వదిలిపెట్టి 
దళితులపై తప్పుడు కేసులు 
తాడికొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలి 

తాడికొండ మండలం కంతేరు దళితులపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వివిధ దళిత సంఘాల ప్రతినిధులు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి బుధవారం వినతిపత్రం అందచేశారు. ఈ నెల 22న  కంతేరు గ్రామంలో దళిత యువకులను మాట్లాడుకుందాం అని పిలిపించి ఆధిపత్య కులాలకు చెందిన యువకులు దాడా చేశారని ఆరోపించారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలనీ, గాయపడ్డ దళిత యువకులపై ఏకపక్షంగా తప్పుడు కేసులు బనాయించిన తాడికొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడ్డ దళిత యువకులకు ముందుగా చికిత్స అందించకుండా వారిని భయపెట్టి వెనక్కి పంపిన డాక్టర్లను సస్పెండ్ చేయాలి.. తీవ్రగాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్లపూడి శామ్యూల్ కి మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో  దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జె. విద్యాసాగర్, భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ళ ప్రకాష్,  భీమ్ సేన సేవాదల్ అధ్యక్షులు నల్లపు నీలాంబరం, జొన్నలగడ్డ శ్రీకాంత్, దళిత ప్రొఫెషనల్ ఫోరం నాయకులు కనకవల్లి వినయ్, మాల మహానాడు నాయకులు బండ్లమూడి స్టాలిన్, మంచాల జోసఫ్, కె గోపి తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *