ap news

భక్తి శ్రద్ధలతో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి “అమ్మవారి ఆత్మార్పణం దినోత్సవం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శిద్దా లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.క్షేత్రంలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారికి ఆదివారం ఉదయం పంచామృత,సుగంధ ద్రవ్యములతో అభిషేకం, విశేషముగా అలంకరణ, తదుపరి సామూహిక శ్రీ లలితా సహస్ర నామ,అష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం, మహా మంగళ హారతి,మంత్ర పుష్పం,క్షమాప్రార్థన,తీర్థ, ప్రసాధములు వితరణ, తదుపరి అన్నప్రసాధ వితరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,వారి కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

వాసవీ అమ్మవారికి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్న దృశ్యం

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *