జీతాలు లేక ఉపాధ్యాయుల ఇబ్బందులు
సంక్రాతి లోపు జీతాలు చెల్లించాలని వైయస్సార్ టి ఏ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ- 2025 ద్వారా APTWREIS (GURUKULAM) లో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు రావడం లేదని, కనీసం సంక్రాంతి పండుగకు కూడా జీతాలు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని, సంక్రాంతి పండుగ లోపు జీతాలు చెల్లించాలని వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలిరెడ్డి, షేక్ జంషీద్ డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయులు లాగా నిధి పోర్టల్, 010 పద్దతిలో APTWREIS (GURUKULAM) ఉపాధ్యాయులకు జీతాలు రావడంలేదు. మెగా డిస్సీ లో అందరూ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. కానీ APTWREIS (GURUKULAM) ఉపాధ్యాయులకు మాత్రం జీతాలు అందక, సర్వీస్ రూల్స్ సక్రమంగా లేక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ నిరక్ష్యం వలనే ఈ పరిస్థితి వచ్చిందని, సమస్య ను వెంటనే పరిష్కరించకపోతే వారి తరపున వైయస్సార్ టి ఏ ఉద్యమిస్తుందని వారు తెలిపారు…
