మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్ఏ

మధ్యవర్తిత్వం తో ఎన్నో సమస్యలు పరిష్కారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం (Mediation) అనేది ఒక ముఖ్యమైన సాధనమని, దీన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యత కలిగిన పద్ధతిగా చూడాలని గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయ సుప్రీం కోర్టు జడ్డిలు, గౌరవనీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయ న్యాయమూర్తులు ఆదివారం విజయవాడ పటమట లోని అంత్రా లక్స్ ఫంక్షన్ హాల్లో స్టేట్ లెవెల్ సింపోసియం ఆన్ మీడియేషన్ డైలాగ్ యాస్ కార్నర్ స్టోన్ ఆఫ్ జస్టిస్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన మధ్యవర్తిత్వం (Mediation) సింపోజియం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ… మొదటి అంతర్జాతీయ మీడియేషన్ కాన్ఫరెన్స్ ఢిల్లి లో జరిగిందన్నారు. మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన ఆల్టర్నేటివ్ గా నేను భావిస్తాను అని అన్నారు. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని పురాతన కాలం నుంచె భారతదేశంలో వినియోగిస్తున్నారు… మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్ఏ (DNA) లోనే ఉందని, వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉందని తెలిపారు. శ్రీకృష్ణుడు పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నాన్ని మొదటి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు. మధ్యవర్తిత్వం తో పరిష్కారం అయ్యే కేసులు కూడా కోర్టుల్లో ఉండిపోతున్నాయి.. మధ్యవర్తులు క్లైంట్ నమ్మకం పొందడం చాలా అవసరం…ప్రతీ ఒక్కరూ న్యాయస్ధానాలను, న్యాయాన్ని నమ్ముతారు.. మధ్యవర్తిత్వాన్ని కోర్టులు కచ్చితంగా అందరికీ తెలిసేలా చేయాలి.. 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం వల్ల దీనికి ఒక చట్టబద్ధత లభించిందని, దీని ద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేయబడతాయని వివరించారు. వివాదంలో ఉన్న వ్యక్తులకు మధ్యవర్తిపై పూర్తి విశ్వాసం ఉండాలన్నారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం వల్ల, న్యాయస్థానాల ద్వారా జరిగే మధ్యవర్తిత్వానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి సరైన శిక్షణ ఉండటం చాలా ముఖ్యం అని అన్నారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించడానికి, త్వరితగతిన, స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఒక అద్భుతమైన మార్గమని అని అన్నారు. మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.. మలేషియాలో మధ్యవర్తిత్వానికి దొరుకుతున్న ప్రోత్సాహాన్ని నేను చూసాను… మధ్యవర్తిత్వం మన జీవితాలలో ప్రతి అంశంలోనూ ఉంది… మధ్యవర్తిత్వం ద్వారా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి.. కమర్షియల్ సమస్యలు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయి..
జ్యుడీషియల్ సిస్టమ్ మీడియేషన్ ను ప్రమోట్ చేయాలన్నారు. మీడియేషన్ ఇప్పుడు చాలా ఆమోదింపదగ్గ ప్రక్రియ…కేవలం ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం కూడా దీనికి ఆదరణ పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీడియేషన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి తో చేసిన మీడియేషన్ విజయవంతం అయ్యిందన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతుల తో జరిపిన చర్చలు ఫలితమే అమరావతి అని అన్నారు. మీడియేషన్ ను మీ లీగల్, ప్రొఫెషనల్ కల్చర్ లో భాగస్వామ్యం చేసుకోవాలని అందరిని కోరుతున్నాను అని అన్నారు.
గౌరవనీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. విశాఖ లో జరిగిన అంతర్జాతీయ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జడ్జి గా ఉన్న సమయం లో అమెరికా లో సెటిల్ అయిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి నన్ను ఓ న్యాయవాదిగా సంప్రదించారన్నారు. ఎందుకు మీరు మీ సోదరుని తో మాట్లాదాకూడదు అని చెప్పాను.. 6 నెలల తర్వాత ఆయన కనిపించి నా ఫ్యామిలినీ, నా సోదరుడిని నేను దూరం చేసుకోలేదు అని చెప్పారన్నారు. మీడియేషన్ కు ఉన్న శక్తి అలాంటిది అని అన్నారు.
గౌరవనీయ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మాట్లాడుతూ… వాదాలను కోర్టుల ద్వారా కాకుండా, చర్చలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం ద్వారా సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయని జస్టిస్ మహేశ్వరి పేర్కొన్నారు. ‘మధ్యవర్తిత్వ చట్టం – 2023’ (Mediation Act 2023) ద్వారా మధ్యవర్తిత్వానికి చట్టబద్ధత లభించిందని, ఇది న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. ప్రజలు న్యాయ పోరాటాల (Litigation) కంటే రాజీ మార్గాలను (Mediation) ఎంచుకునేలా మానసిక ధోరణిని మార్చుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ బోధించినట్లుగా, సమస్యలను పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవడమే నిజమైన న్యాయమని, ఇది సమాజంలో సామరస్యానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే, న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ఒక సంస్కరణగా మారి, తక్కువ ఖర్చుతో మరియు త్వరగా న్యాయం అందించే మార్గంగా ఎదగాలని జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆకాంక్షించారు..
ఏపీ లీగల్ సెల్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ… న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం తోడ్పడుతుందన్నారు. సాంప్రదాయ కోర్టుల ద్వారా న్యాయం పొందడంలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ‘మధ్యవర్తిత్వం’ ఒక గొప్ప ప్రత్యామ్నాయ మార్గమని ఈ సదస్సులో నొక్కి చెప్పారు. గతంలో మధ్యవర్తిత్వ చట్టం ద్వారా దాదాపు 2 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. కేసులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఇటీవలే దాదాపు 400 మంది మధ్యవర్తులకు (Mediators) శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అలాగే, హైకోర్టు న్యాయమూర్తుల కోసం ప్రత్యేక సౌకర్యాల కల్పన, నివాస సముదాయాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈ సదస్సు న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వాన్ని ఒక బలమైన స్తంభంగా మార్చి, సామాన్యులకు సత్వర న్యాయాన్ని అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శ్రీ జస్టిస్ పి. ఎస్. నరసింహ, శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, శ్రీ జస్టిస్ ఎస్. వి. ఎన్. భట్టి, శ్రీ జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి.సాయి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, జిల్లా జడ్జిలు, జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాధులు, బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
