విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్పుకు ప్రయత్నం
విశ్వనాధ సత్యనారాయణ పేరు పెడతాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి ప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టేందుకు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నరసరావుపేటలో ఏర్పాటుచేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష కోసం కృషి చేసిన మహనీయులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో పొగాకు పంటలకు సదుపాయాలు కల్పిస్తున్నాం…నాగార్జునసాగర్ కుడి కాల్వను మరింత బలోపితం చేసే అవకాశం ఉంది..నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా సమృద్ధిగా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తెలుగు భాష పునర్ వైభవం కోసం పాటు పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు లక్ష్మీనారాయణ, నల్లమోతు వెంకటరమణ పల్నాడు జిల్లా అధ్యక్షుడు శశికుమార్, డాక్టర్ నాగోత్ ప్రకాష్, బొడ్డిచెర్ల అనిల్ కుమార్, కోట్లి బ్రహ్మయ్య, రామల శ్రీనివాసరావు తో పాటు, తదితరులు పాల్గొన్నారు.

