ప్రముఖ చిత్రకారుడు తిమ్మిరి రవీంద్రకు అభినందనలు
ప్రశంసలు పొందిన రైల్వే కూలీలపై శ్రమైక జీవన చిత్రం
ఒంగోలుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ తిమ్మిరి రవీంద్ర ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం లో ఆదివారం ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్, కళా యజ్ఞ సంస్థలు సంయుక్తంగా ‘శ్రమైక జీవనం’ అనే అంశంపై నిర్వహించిన చిత్ర కళా ప్రదర్శనలో రైల్వే కూలీలపై రవీంద్ర కుంచె నుంచి జాలు వారిన చిత్ర ప్రదర్శనకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖ కార్డూనిస్ట్ శ్రీధర్ (ఈనాడు శ్రీధర్)తో పాటు ఎస్.వి యూనివర్శిటీ ప్రొఫెసర్ సాగర్ గిన్నె, యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.మృత్యుంజయరావు, కళా యజ్ఞ నిర్వాహకుడు ఏలూరి శేష బ్రహ్మం, ప్రముఖ చిత్రకారుడు మర్లపూడి ఉదయకుమార్ లు రవీంద్రను అభినందిస్తూ శాలువా, సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు.
