ap news

బస్సు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి

మృతుల కుటుంబాలకు కోటి చోప్పున సహాయం అందించాలి

యంయల్ సీపిఐ(రెడ్ ఫ్లాగ్) రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు డిమాండ్

ఆంధ్రావనిన్యూస్, విజయవాడ : కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో కారకులపై, కారణాలపైన ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మృతుల బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలి. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించి, కోలుకున్నాకా వారిని స్వస్థలాలకు ఉచిత ప్రయాణంతో వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని శుక్రవారం ఒక ప్రకటనలో యంయల్ సీపిఐ(రెడ్ ఫ్లాగ్) రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ – బెంగళూరు బస్సు ప్రమాదంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఇరవై మంది ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, మృతులకు నివాళులర్పించారు. కనీసం ఇంత ఘోర ప్రమాదం జరిగిన సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యం ఏలుతున్న రవాణా మాఫియా గురించి, అది సాగిస్తున్న అక్రమాల గురించి, ఆ అక్రమాలను చూసీ చూడనట్టు నడవనిస్తున్న ట్రాన్స్ పోర్ట్, పోలీసు, ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రవాణా మాఫియా నుంచి ముడుపులు తీసుకునే రాజకీయ నాయకత్వం గురించి, లేదా రాజకీయాల్లోకి ప్రవేశించి, విధాన నిర్ణయంలో పాల్గొంటున్న రవాణా మాఫియా రాజకీయ ప్రజాప్రతినిధుల పట్ల కూడా చర్యలు తీసుకోవటం ద్వారానే సమస్యకు శాశ్విత పరిష్కారం కొంత మేరకు దొరుకుతుందని రెడ్ ఫ్లాగ్ పార్టీగా భావిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *