దగ్గుబాటికి చంద్రబాబు పరామర్శ
అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబునాయుడు పరామర్శించారు. గుండెకు స్టంట్ వేయించుకుని అసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటిని మంగళవారం పరామర్శించిన చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పరామర్శ సమయంలో వెంకటేశ్వరరావు సతీమణి దగ్గుబాటి పురంధ్రీశ్వరి కూడా అక్కడే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఆత్మీయ పరామర్శ అందరిలోనూ ఆసక్తిరేపింది.
