6,7 తేదీల్లో దళిత గిరిజన బహుజన సంఘాల సదస్సు

విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహణ
దళిత, బీసీ, గిరిజన జేఏసీ కన్వీనర్ కొరివి వినయకుమార్
దళిత గిరిజన బహుజన సంఘాల సమాలోచన కార్యాచరణ రాష్ట్ర సదస్సును ఈనెల 6, 7 తేదీల్లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించనున్నట్టు ఎస్.సి, ఎస్.టి, బి.సి జేఏసీ కన్వీనర్ కొరివి వినయకుమార్ తెలిపారు. ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవనున్న సదస్సు ఈనెల 7న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. దళిత,బీసీ, గిరిజనుల సంక్షేమ, అభివృద్ధి పథకాలు, భూమి, సబ్ ప్లాన్, రక్షణ చట్టాల అమలు తీరు, విద్య, ఉద్యోగ సమస్యల పై సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దళిత, బీసీ, గిరిజనుల సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తున్న వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.. దళిత, గిరిజన, బీసీ, బహుజన ద్యోగ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాలు, పౌర, ప్రజాస్వామిక సంఘాలు, అత్యాచార, వేధింపు బాధితులు , భూమి, ఉపాధి, నిర్వాసిత హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులను సదస్సుకు ఆహ్వానించినట్టు వినయకుమార్ వెల్లడించారు.

