డీఎంఈ ఇన్ఛార్జిగా డాక్టర్ రఘునందన్

డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ఇంచార్జిగా డాక్టర్ జి. రఘునందన్(59) ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రస్తుత డీఎంఈ డాక్టర్ డియస్ ఎల్‌వి నరసిoహం ఉద్యోగ విరమణ దృష్ట్యా ఈ నియాకం జరిగింది. డీఎంఈగా తనకు అవకాశాన్ని కల్పించిందినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు డాక్టర్ జి. రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి గ్రామానికి చెందిన డాక్టర్ రఘునందన్ ఆర్థోపెడిక్స్ వైద్యులు. కడప, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, విజయవాడ బోధనాసుపత్రుల్లో వివిధ హోదాల్లో విధులను నిర్వహించారు. ప్రస్తుతం డీఎంఈ కార్యాలయంలో అడిషనల్ డీఎంఈగా విధులు నిర్వహిస్తున్నారు.