రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. అధికారిగా డాక్టర్ మద్దినేని

అమరావతి, జూలై 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. (NSS) అధికారిగా డా.మద్దినేని సుధాకర్ నియమితులయ్యారు. వీరు ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు నందు గత 30 సంవత్సరములుగా మేథమెటిక్స్ విభాగంలో ఆచార్యునిగా సేవలందించారు. మరియు గత 23 సంవత్సరాల నుండి కళాశాల ఎన్.ఎస్.ఎస్. అధికారిగా, జిల్లా అధికారిగా ఎన్.ఎస్.ఎస్. ద్వారా విశిష్ట సేవలు అందించారు. వీరు ఎన్.ఎస్.ఎస్. ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకోవడంతో పాటు యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్.ఎస్.ఎస్. అధికారిగా, జాతీయ స్థాయిలో “నేషనల్ బెస్టు ఇందిరా గాంధి ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్” గా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి నుండి అందుకున్నారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డు రికార్డు ను కూడా సాధించారు. వీరి విద్యాభ్యాసం జె.కె.సి. కళాశాల, ఐఐటి బోంబే మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు.