ఎల్ల్విన్ ఎనర్జీకి ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డులు !

రెండు సోలార్ అవార్డులు ప్రదానం
– దేశంలో సోలార్ రంగంలో దూసుకుపోతున్న ఎల్ల్విన్ ఎనర్జీ
– అంతర్జాతీయ స్థాయి ఈక్వీ మ్యాగజైన్, సోలార్ క్వార్టర్ అవార్డుల ప్రదానం
– రానున్న ఇదేళ్లల్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు..
-10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్, 20 వేల మందికి ఉద్యోగాలు..
– 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు
– ఎల్ల్విన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ భాస్కర్ వెల్లడి
దేశంలోని సోలార్ పరిశ్రమలో ఎల్ల్విన్ ఎనర్జీ మరో ఘనమైన మైలురాయిని అందుకుంది. వేగంగా ఎదుగుతున్న సోలార్ ఎనర్జీ సంస్థగా పేరొందిన ఎల్ల్విన్ ఎనర్జీకి, ప్రపంచ ప్రఖ్యాత సోలార్ రంగ పత్రికలు ఈక్వీ మ్యాగజైన్ మరియు సోలార్ క్వార్టర్ నుంచి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు లభించాయి. నాణ్యత, కస్టమర్ సంతృప్తి, వ్యాపార వృద్ధి అనే మూడు కీలక ప్రమాణాల్లోనూ అసాధారణ ప్రతిభ చూపిన సంస్థగా ఎల్ల్విన్ ఎనర్జీ ఈ డబుల్ గుర్తింపును సొంతం చేసుకుంది.

అమరావతి, ఆంధ్రావని న్యూస్ : దేశంలోని వేగంగా ఎదుగుతున్న సోలార్ ఎనర్జీ సంస్థ ఎల్ల్విన్ ఎనర్జీకి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. సోలార్ రంగానికి చెందిన ప్రముఖ గ్లోబల్ పబ్లికేషన్లు ఈక్వీ మ్యాగజైన్ మరియు సోలార్ క్వార్టర్ సంస్థకు రెండు కీలక అవార్డులను ప్రకటించాయి. ఈక్వీ మ్యాగజైన్ నుంచి హై గ్రోత్ అండ్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు, సోలార్ క్వార్టర్ నుంచి సోలార్ ఈపీసీ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎల్ల్విన్ ఎనర్జీకి దక్కాయి.నాణ్యత ప్రమాణాలు, వినియోగదారుల సంతృప్తి, వ్యాపార విస్తరణ అనే మూడు కీలక అంశాల్లో అసాధారణ ప్రతిభ చూపినందుకు ఈ అవార్డులు అందించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీతో నిండిన సోలార్ రంగంలో ఈ మూడు ప్రమాణాల్లోనూ ఒకేసారి ముందంజలో నిలవడం అరుదైన విషయమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ సందర్భంగా ఎల్ల్విన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ భాస్కర్ మాట్లాడుతూ.. నాణ్యమైన సోలార్ పరిష్కారాలను అందిస్తూ కస్టమర్ సంతృప్తిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న తమ ప్రయత్నాలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థల నుంచి వచ్చిన ఈ గౌరవం, భారత సోలార్ రంగంలో ఎల్ల్విన్ ఎనర్జీకి పెరుగుతున్న విశ్వసనీయతను చాటుతోందని పేర్కొన్నారు.కేవలం ఆరు నెలల క్రితమే సోలార్ రూఫ్‌టాప్ విభాగాన్ని ప్రారంభించిన ఎల్ల్విన్ ఎనర్జీ, ఇప్పటికే 500 మంది ప్రత్యక్ష ఉద్యోగులను నియమించడంతో పాటు, వెయ్యి మందికిపైగా పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించింది. సంస్థ వేగవంతమైన విస్తరణకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా చేసుకుని స్థిరమైన అభివృద్ధికి దోహదపడేలా సంస్థ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వచ్చే ఇదేళ్లల్లో 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం, 20 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం సంస్థ లక్ష్యాలుగా ప్రకటించింది. సోలార్ పరిశ్రమలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన 30 ఏళ్ల ఉత్పత్తి వారంటీతో పాటు, పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకూ సేవలందించే విస్తృత సర్వీస్ నెట్‌వర్క్‌ను ఎల్ల్విన్ ఎనర్జీ ఏర్పాటు చేస్తోంది. దీర్ఘకాలిక కస్టమర్ సంబంధాలే తమ బలమని సంస్థ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా సోలార్ రంగ పరిణామాలను విశ్లేషించే ఈక్వీ మ్యాగజైన్, సోలార్ క్వార్టర్ వంటి పబ్లికేషన్లు ఇచ్చే అవార్డులు, ఎల్ల్విన్ ఎనర్జీ గ్లోబల్ స్థాయిలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈక్వీ మ్యాగజైన్ అందించిన హై గ్రోత్ & క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు ద్వారా ఎల్ల్విన్ ఎనర్జీ తన ఆపరేషనల్ ఎక్సలెన్స్‌ను చాటుకోగా, సోలార్ క్వార్టర్ నుంచి లభించిన సోలార్ ఈపీసీకంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంస్థ సాంకేతిక నైపుణ్యం, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యానికి ముద్ర వేసింది. తీవ్ర పోటీ ఉన్న సోలార్ ఈపీసీ రంగంలో ఈ రెండు అవార్డులు ఒకే సమయంలో దక్కడం సంస్థకు అరుదైన ఘనతగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ పై భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌ను తమ ప్రధాన వృద్ధి కేంద్రంగా మలచుకోవాలనే లక్ష్యంతో ఎల్ల్విన్ ఎనర్జీ దూకుడు ప్రణాళికను ప్రకటించింది. మార్చి 2028 నాటికి 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ సరఫరా చేయడం, 20 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే రూ.3,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడం సంస్థ లక్ష్యాలుగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు గణనీయమైన తోడ్పాటును అందించనున్నాయి.
కస్టమర్ సర్వీస్‌లో కొత్త ప్రమాణాలు
సోలార్ పరిశ్రమలో అరుదైన 30 ఏళ్ల ఉత్పత్తి వారంటీని అందిస్తూ, ఎల్ల్విన్ ఎనర్జీ కస్టమర్ సర్వీస్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు శిక్షణ పొందిన టెక్నీషియన్లతో విస్తృత సేవా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, ప్రాజెక్ట్ అమలు తర్వాత కూడా వినియోగదారులకు నిరంతర మద్దతు అందించడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
గ్లోబల్ గుర్తింపుతో బ్రాండ్ బలోపేతం
ప్రపంచవ్యాప్తంగా సోలార్ రంగంపై లోతైన అధ్యయనం చేసే ఈక్వీ మ్యాగజైన్, సోలార్ క్వార్టర్ వంటి పబ్లికేషన్ల అవార్డులు, ఎల్ల్విన్ ఎనర్జీ బ్రాండ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత బలం చేకూర్చినట్లు పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుర్తింపులు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు, రాబోయే రోజుల్లో సంస్థ విస్తరణకు కీలకంగా మారనున్నాయి.
