నేడు తురకపాలెంకు నిజనిర్దారణ కమిటీ

తురకపాలెంలో గత రెండు నెలలుగా దాదాపు 30 మంది అకాల మరణానికి గురైన సందర్భంగా గుంటూరు నగరంలోని జనచైతన్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, కోవిడ్ ఫైటర్స్, అవగాహన, రేట్ పేయర్స్ అసోసియేషన్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఈనెల 6వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు తురకపాలెం లోని మెడికల్ క్యాంప్ జరిగే ప్రదేశానికి చేరి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి కృషి చేయనున్నట్టు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తురకపాలెం లోని మెడికల్ క్యాంప్ వద్ద మీడియాతో ప్రసంగిస్తారు. నిజ నిర్ధారణ కమిటీ బృందంలో కె.ఎస్. లక్ష్మణరావు మాజీ శాసనమండలి సభ్యులు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి జనచైతన్య వేదిక అధ్యక్షులు, ఏవి పటేల్ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఓరుగంటి నారాయణ రెడ్డి రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, డాక్టర్ సేవా కుమార్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, ముంతాజ్ వికలాంగుల కమిటీ మాజీ అధ్యక్షురాలు, అల్లాబక్షు కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు, టి. ధనుంజయ రెడ్డి సామాజిక విశ్లేషకులు, కె. సతీష్ మానవత సెక్రటరీ తదితరులు పాల్గొంటారు. కావున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తురకపాలెం లోని మెడికల్ క్యాంప్ దగ్గర ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు.
