ap news

13న ట్రాక్టర్లతో ర్యాలీ

భారీ  స్థాయిలో నిరసన ప్రదర్శనలు 

ట్రంప్, మోడీ దిష్టి బొమ్మల దగ్ధానికి పిలుపు 

విజయవాడలో రైతు సంఘాల సమావేశం 

విజయవాడ: ట్రంప్, మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతాంగం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని ఏపీ రైతు సంఘాల సమావేశం పిలుపునిచ్చింది. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్క్లబ్ లో శనివారం రాష్ట్ర రైతు సంఘాల నాయకుల సమావేశం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ట్రంప్, మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర రావు పిలుపునిచ్చారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వలన భారత వ్యవసాయ రంగాన్నికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు. గతంలో గాట్, డంకెల్, ప్పపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు వలె ఈ ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరతాయన్నారు. యంత్రాలు అమ్ముకోవటానికి స్వేచ్ఛ వాణిజ్య ఉపయోగపడుతుందన్నారు. 10 సంవత్సరాల నాటి ట్రాక్టర్ లను రద్దు చేయాలని, వాటి స్థానంలో కొత్త ట్రాక్టర్ లు కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమైనటువంటి విధానాలన్నారు. వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయంకు, రైతులకు వినాశకరంగా ఉండకూడదని హితవు పలికారు. వ్యవసాయని నాశనం చేసి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానం మని విమర్శించారు. రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. రైతులు, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవివి ప్రసాద్ మాట్లాడుతూ అటవీ జంతువు నుండి పంటలకు రైతులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలకు భూపందేరం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని రద్దు చేయాలని ఈనెల 13న దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించాలని బైక్, ట్రాక్టర్ లతో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరపాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు ఈ విధానాల వ్యతిరేకిస్తూ జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు, రైతు కూలీ సంఘం యు.వీరబాబు, కిసాన్ సంఘటన్ మరీదు ప్రసాద్ బాబు, కిసాన సభ తోట ఆంజనేయులు, ప్రగతిశీల రైతు సంఘం ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *