పురుషుల్లోనూ వంధ్యత్వం పై అవగాహన పెరగాలి
- అందుబాటులోకి ఫెర్టీ 9 ఏ ఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్ష
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏ ఐ వీర్యఅనలైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు
- వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం కీలక ముందడుగు
- ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి
హైదరాబాద్ : పురుషుల్లోనూ వంధ్యత్వం పై అవగాహన పెరగాలని, ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు. ప్రస్తుత రోజుల్లో పురుష వంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ, అది తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందన్నారు. ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ, ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని చెప్పారు. జూలై 25న ప్రపంచ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పురుష సంతానోత్పత్తిపై అవగాహన పెంచే దిశగా ఫెర్జీ 9 సికింద్రాబాద్ లోని కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబందించిన లోగోలను డాక్టర్ జ్యోతి, ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినేష్ గాధియా బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. జంటలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ వేడుక మొదటి అడుగు వేయడంలో ఇంకా వెనుకడుగేస్తున్న పురుషులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో ఫెర్టీ ఇప్పుడు ఖచ్చితమైన ఫెర్టిలిటీ కేర్ కొత్త ప్రమాణాలను స్థాపిస్తోందన్నారు. పురుషుల ఫెర్టిలిటీ టెస్టింగ్ ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా, సంకోచం లేనిదిగా మార్చాలనే తమ ప్రయత్నం అన్నారు. ఎందుకంటే సంతానోత్పత్తి బాధ్యత మహిళలది మాత్రమే కాదని, ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు.
ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినేష్ గాధియా మాట్లాడుతూ ఫెర్టీ 9లో తాము ఐ వీ ఎఫ్ విజయాన్ని మెరుగుపరచడంలో నాణ్యత పట్ల రాజీ పడకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పిండం అభివృద్ధిలో మగ గామెట్ (వీర్యకణాల) పాత్ర దాదాపు 50 శాతం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయని, అందువల్ల ఖచ్చితమైన స్పెర్మ్ అంచనా ఎంతో కీలకం అన్నారు. సంప్రదాయ వీర్య పరీక్షలకు ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని తాము ఆధునిక ఏ ఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ సిస్టమ్ వేగవంతమైన, అధిక ఖచ్చితత గల విశ్లేషణను అందించి, ఉత్తమమైన స్పెర్మ్ ఎంపికను సాధ్యం చేస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన పిండాలు ఏర్పడి, గర్భధారణ విజయాలు మెరుగవుతాయి. దీని ఫలితంగా, జంటలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, తల్లిదండ్రులయ్యే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చన్నారు. ఈ చొరవ ఫెర్టీ యొక్క రోగి కేంద్రీకృత సంరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఆధునిక సాంకేతికతను సమగ్ర అవగాహన చర్యలతో అనుసంధానించడం ద్వారా, ఈ కేంద్రం చికిత్సా ఫలితాలను మెరుగుపరచడంతో పాటు మగవారి పునరుత్పత్తి ఆరోగ్యంపై భారతదేశం దృష్టిని సరికొత్త దిశగా మలుపుతిప్పుతోంది.
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజా గణాంకాల ప్రకారం, భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోవడం భర్తీ స్థాయైన 2.1 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ (1.7, తెలంగాణ (1.8)లో ఈ రేట్లు మరింత తక్కువగా ఉండటం, సమకాలీన వంధ్యత్వ జోక్యాల అవసరాన్ని తెలియచేస్తోంది. ఈ నేపథ్యంలో, ఫెర్టీ ఫెర్టిలిటీ సెంటర్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీమెన్ ఎనలైజర్ను ప్రవేశపెట్టి, రెండు రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి బ్రాండ్ గా నిలిచింది. పురుష కారకాలు సుమారు 50 శాతం వంధ్యత్వ సమస్యలకు కారణమవుతాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ ఫెర్జీ ఆంతర్య డేటా ప్రకారం 95 శాతం ప్రాథమిక కన్సల్టేషన్లు మహిళల నుంచే వస్తున్నాయి. ఇది పురుషులలో ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవగాహన లోపాన్ని తెలియచేస్తోంది. కొత్త ఏఐ విధానం వీర్యం యొక్క పరిమాణం, కదలిక, ఆకృతి మరియు జన్యు సమగ్రతపై అల్గోరిథం ఆధారిత విశ్లేషణలను అందిస్తూ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది ప్రతి నమూనాను విశ్లేషించి సింగిల్ డబుల్-స్ట్రాండ్ జన్యు విచ్ఛిన్నతలను గుర్తిస్తుంది. దీని వల్ల వేగవంతమైన, పకడ్బందీ నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ అధునాతన విశ్లేషణల ద్వారా ఐ.వి.ఎఫ్ చికిత్సలలో ఉత్తమ నాణ్యత గల వీర్యాన్ని ఎంచుకోవడం సులభతరం అవుతుంది. ఫలితంగా, పిండం (ఎంబ్రియో) నాణ్యత మెరుగుపడి గర్భస్రావం జరిగే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఈ పరిణామం సంతానలేమితో బాధపడుతున్న దంపతులు చికిత్స వైపు మరింత త్వరగా పూర్తి విశ్వాసంతో అడుగులు వేయడానికి సహాయపడుతుంది.