gunturu

ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలు తీర్చాలి

మాట్లాడుతున్న దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ కుమార్

దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ కుమార్

గుంటూరులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

ప్రజల రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ కుమార్ అన్నారు. డిసెంబర్ 10న బుధవారం గుంటూరు DBF కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో కొరివి వినయ కుమార్ ముఖ్య వక్త గా పాల్గొన్నారు. మానవ హక్కులు, కనీస అవసరాలైన రక్షిత మంచి నీరు, స్వచమైన గాలి, పౌష్టికారం,గృహవసతి, మెరుగైన ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య,వివక్షకు తావు లేని జీవనోపాధి , సామాజిక న్యాయo లాంటి అంశాలను గుర్తించే లాగా పౌర సమాజం ప్రభుత్వo పై వత్తిడి పెంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని కొరివి వినయ కుమార్ పేర్కొన్నారు. మానవ హక్కుల కార్యకర్త “ల్యాంప్ స్వచ్ఛందసంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మన్ పాల్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ఆదేశాల ప్రకారం ఎనిమిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమలు పరచడం ద్వారా ఆయా దేశాలలో పేదరికం, అసమానతలను తొలగించి సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని భావించిందన్నారు . 2029 నాటికి ఈ లక్ష్యాలను చేరేందుకు ప్రతి ప్రభుత్వం కృషి చేయాలని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ మన దేశంలో వివిధ రంగాల్లో మనం ఇంకా ఎంతో వెనకబడిపోయి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రాజకీయ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యతతో వ్యవహరిస్తూ మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలతో కలిసి పనిచేసి ప్రజల్ని అభివృద్ధి దిశగా నడిపించాలని సూచించారు. ఈ సభకు న్యాయవాది పొందుగల ప్రకాష్ అధ్యక్షత వహించగా బీసీ ఉద్యమ రాష్ట్ర నేత ఉగ్గం సాంబశివరావు ,SC St గెజిటెడ్ ఆఫీసర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సా రత్న ప్రసాద్ , ఆవాజ్ నాయకులు చిష్టి సామాజిక వేత్త డాక్టర్ . మూకిరి సుధా ,వాయిస్ ఆఫ్ జస్టిస్ నేత ప్రశాంతి, LHPS నేత డి.చంద్రనాయక్, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు తుర్కా వీరయ్య, నల్లపు నీలాంబరం, కొరివి రజనీష్,పాలకాయల వెంకట్, ప్రకాష్, బి.సురేంద్ర,సూరిబాబు, రామారావు , మద్ద శ్యామ్, సురేష్, పిల్లి రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *