గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్

కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు సత్కారం
కార్గిల్ యుద్ధంతో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించిన వీర సైనికులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరునికి ఉందని బీజేపీ తెలంగాణ ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోపు రమణారెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో హైదరబాద్ లోని ఆర్‌కే పురం ఆఫీసర్స్ కాలనీ (వైట్ హౌస్)లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్గిల్ వీరుల ధైర్యం, నిబద్ధత ఎప్పటికీ దేశ పౌరులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో పోరాడి, పాకిస్తాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన వీర జవాన్లను సత్కరించారు.

సత్కారం అందుకున్న జవాన్లు
రామ్ ప్రసాద్, బి.కె. వైష్ణవ్, ఎస్.బి. రాయ్, హెచ్.సి. పాండే, ఆర్.పి. ఠాకూర్, రమేష్ రాయ్, సురేష్ రాయ్, ఆర్.పి.ఐ. తివారి, ఎం. చౌదరి, ఎస్.ఆర్. శర్మ, లక్ష్మణ్ తివారి, ఎ.కె. సింగ్, విజయ్ మిశ్రా, డి.కె. కృష్ణమూర్తి, ఎం.ఎస్. ఝా, ఎన్.సి. ఘోష్, అవధేష్ మిశ్రా, వి.కె. ఝా, ఆర్.ఎన్. సింగ్, ఆర్.పి.ఐ. గుప్తా, కె.కె. ఝా, ఎ.కె. తివారిలను ఘనంగా సన్మానించారు. అడ్వకేట్ ప్రసన్న నాయుడు, డాక్టర్ విజయారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.