బసవతారకంలో ఉచిత కన్సల్టేషన్

20 శాతం తగ్గింపుతో వ్యాధి నిర్థారణ పరీక్షలు

ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం..

ఏటా ఫిబ్రవరి 4 వ తేది న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై విస్తృత అవగాహన కలిపించడంతో పాటూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపడుతారు. అంతే గాకుండా ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు అందరికీ క్యాన్సర్ చికిత్స అందించేలా కృషి చేయడం అన్న ప్రత్యేక నినాదం చేపట్టడం జరిగింది. తద్వారా ఎటువంటి తరతమ్య బేదాలు లేకుండా అందరికీ క్యాన్సర్ చికిత్స అందించడం దీని లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతుగా భారత దేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ హాస్పిటల్ గా పేరు గడించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా రేపు అనగా ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లందరికీ ఉచితంగా కన్సల్టేషన్ సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉచిత కన్సల్టేషన్ సేవలు మొదటి సారి హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లతో పాటూ వైద్యులను తిరిగి సంప్రదించడానికి వచ్చే పేషెంట్లకు కూడా వర్తించనుంది. అంతే గాకుండా ఫిబ్రవరి 4 నాడు హాస్పిటల్ లో అందుబాటులో ఉండే పలు లాబొరేటరీ, రేడియాలజీ, న్యూక్లియస్ మెడిసిన్ లాంటి విభాగాలలో వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకునే వారికి ఫీజు మొత్తంలో 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నారు. అనగా 20 శాతం తగ్గింపు ఫీజుతో పేషెంట్లు తమ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ సదవకాశాన్ని పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్,బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మరియు సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *