ఆమెకు అరుదైన వ్యాధి..ఆస్టర్ ప్రైమ్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ
అరుదైన ఆరోగ్య సమస్య తో భాదపడుతున్న మహిళకు సరికొత్త జీవనాన్నిచ్చిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు కు చెందిన వైద్యులు
అరుదైన ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న వారికి స్వాంతన చేకూర్చే లాప్రోస్కోపిక్ సర్జరీ పై
ప్రజలలో అవగాహన కలిపించాలని వైద్య నిపుణుల విజ్ఞప్తి
మెరుగైన చికిత్స అందించి మంచి ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో రోగాన్ని గుర్తించడం ఎంతో అవసరం. అయితే అరుదైన లక్షణాలతో కూడిన వ్యాధుల విషయంలో సరైన సమయంలో గుర్తించడం అనే అంశం కొంత సంక్లిష్టంగా మారడంతో పలు సందర్భాలలో ఆ వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. పలు అరుదైన వ్యాధుల పట్ల సరైన అవగాహన ప్రజలలో లేకపోవడం ఆ రోగి కష్టాలను మరింత పెంచివేస్తాయి.
ఇలాంటి పరిస్థితే శ్రీ సుమిత్రది. వికారాబాద్ జిల్లా ఎన్నారాం గ్రామానికి చెందిన 33 సంవత్సరముల మహిళ సుమిత్ర తీవ్రమైన కడుపునొప్పి భాదపడుతున్నదని బంధువులు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. భోజనం తర్వాత ఏర్పడే ఈ కడుపునొప్పి తో పాటూ వికారం, వాంతులు రావడం, కడుపు ఉబ్బరం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఊపిరితిత్తులలో నొప్పితో మొదలై గుండె పోటు వచ్చిందన్న రీతిలో ఎడమ చేతిలో తీవ్రమైన నొప్పి మరియు తీవ్రమైన అలసట వంటి లక్షణాలతో గత రెండు సంవత్సరములుగా ఆమె భాదపడుతోంది. పలువురు వైద్యులను సంప్రదించి వివిధ రకములైన మందులు వినియోగించినా సమస్య కు పరిష్కారం లభించకపోగా ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.
రోగి పరిస్థితిని నిశితంగా గమనించిన హైదరాబాదు, అమీర పేటలోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు అల్ట్రా సౌండ్ డాప్లర్ పరీక్ష తో పాటూ సి టి యాంజీయోగ్రఫీ నిర్వహించారు. ఈ పరీక్షలో median arcuate ligament అనగా ఊపిరితిత్తుల వద్ద ఉండే ఆర్క్ ఆకారంలో ఉంటే టిష్యూ ద్వారా extrinsic celiac artery (బాహ్య ఉదరకుహర ధమని) ఒత్తిడికి గురై నొక్కబడడం వలన DUNBAR’s సిండ్రోమ్ (Median Arcurate Ligament Syndrome) అనబడే ఆరోగ్య సమస్య తలెత్తిందని వైద్యులు గుర్తించారు. పొత్తి కడుపు పై భాగంలో నొప్పి లక్షణం మాత్రమే కనిపిస్తూ లక్షమంది రోగులలో ఇద్దరికి మాత్రమే వచ్చే అరుదైన ఆరోగ్య సమస్య DUNBAR’s సిండ్రోమ్.
ఈ పరిస్థితులలో సరైన రీతిలో ఆహారం తీసుకోని కారణంగా బరువు తగ్గడం లాంటి లక్షణాలతో రోగి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపధ్యంలో శరీరానికి తక్కువ కోత పెట్టే లాప్రోస్కోపిక్ పద్దతిలో నిర్వహించే median arcuate ligament release అనబడే శస్త్ర చికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. ఈ శస్త్ర చికిత్స సందర్భంగా వైద్యులు ఊపిరితిత్తుల వద్ద ఉండే ఆర్క్ ఆకారంలో ఉంటే టిష్యూ (median arcuate ligament) కు కోత పెట్టడమే కాకుండా కడుపు భాగానికి చెందిన పలు నరములను విడతీస్తారు. తద్వారా దమనిపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్త సరఫరా సాధారణంగా జరిగేలా చూస్తారు. సాధారణంగా లాప్రోస్కోపిక్ పద్దతిలో నిర్వహించే ఈ శస్త్ర చికిత్సను కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొందరు రోగులకు మాత్రం సాధారణ శస్త్ర చికిత్స పద్దతిలో చేయాల్సి రావచ్చు.
అయితే ఈ రోగి కి శరీరానికి తక్కువ కోత పెట్టే లాప్రోస్కోపిక్ పద్దతిలో శస్త్ర చికిత్సను చేయాలని తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన డా. బి సృజన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ – జనరల్ మరియు లాప్రొస్కోపిక్ సర్జన్ వారి నేతృత్వంలో డా. బాల వికాస్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఆంకో-రోబోటిక్ సర్జన్, డా. టి నరేన్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ మరియు లాప్రొస్కోపిక్ సర్జన్ తో పాటూ లు శస్త్ర చికిత్స చేయగా అందుకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన డా. ఉమా శ్రీదేవి, డా సియన్ చంద్ర శేఖర్ మరియు డా. వాసుదేవ రావు లతో కూడిన అనస్థీషియా వైద్య నిపుణులు సహకారం అందించారు.
ఇలా సీనియర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స విజయవంతమై రోగి తనకు ఎదరువుతున్న ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా విముక్తి పొందడమే గాకుండా తదుపరి నిర్వహించిన సి టి యాంజియోగ్రఫీ లో celiac trunk పై ఒత్తిడి పూర్తిగా తగ్గిపోవడం జరిగిందని నిర్థారణ అయింది. ఇలా అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో భాదపడుతున్న రోగి తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారి ఇంటికి వెళుతున్న సందర్భంగా చికిత్స అందించిన వైద్య బృందం తత్సబంధిత వివరాలను నేడు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మీడియాకు వెల్లడించింది.
ఈ సందర్భంగా డా. బి సృజన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ – జనరల్ మరియు లాప్రొస్కోపిక్ సర్జరీ మాట్లాడుతూ ఎందుకు వస్తుందో తెలియని పొత్తి కడుపు నొప్పితో వచ్చే DUNBAR’s సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య ప్రతి లక్ష మందిలో ఇద్దరికి మాత్రమే ఏర్పడే అవకాశముందని చెప్పారు. అంతే గాకుండా ప్రతి ముగ్గురు మహిళలలో ఒక పురుషునికి మాత్రమే ఈ సమస్య ఏర్పడవచ్చని అన్నారు. ప్రస్థుతం ఈ సమస్యతో భాదపడుతున్న మహిళ వయస్సు కూడా 18 నుంచి 30 సంవత్సరముల మధ్య ఉన్నదని వివరించారు. సాధారణంగా ఇలాంటి లక్షణాలతో భాదపడే వారిని పరిశీలిస్తే వారికి esophagitis, pancreatitis, cholelithiasis, మరియు ఆహారం పడకపోవడం వంటి ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు భావిస్తుంటారని అన్నారు. అయితే ఈ సమస్యపై నిశితంగా అవగాహన ఉన్న నిపుణులైన వైద్యులు మాత్రమే ఇది DUNBAR’s సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య అని నిర్థారించగలరని చెప్పారు. ఈ ఆరోగ్య సమస్య రావడానికి సరైన కారణాలు ఇంకా నిర్థారించబడలేదని అయితే మహిళలు, పురుషులు, చిన్న పిల్లలు అందరిలోనూ ఇది తలెత్తవచ్చని వివరించారు. అందుకే తీవ్రమైన పొత్తి కడుపుతో భాదపడే రోగులకు సంబంధించి వ్యాధి నిర్థారణ చేసే సమయంలో ఇతర వ్యాధులతో పాటూ DUNBAR’s సిండ్రోమ్ పై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
అనంతరం చికిత్సను విజయవంతంగా అందుకొని పూర్తిగా ఆరోగ్యవంతురాలైన రోగి శ్రీమతి సుమిత్ర మాట్లాడుతూ తన ఆరోగ్యసమస్యకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి తదనుగుణంగా శరీరంపై అత్యంత తక్కువ కోతను విధిస్తూ చేసిన శస్త్ర చికిత్స ద్వారా నాణ్యమైన చికిత్సను అందించి నొప్పి, భాద నుండి విముక్తి కలిగించి తిరిగి ఆరోగ్యవంతురాలుగా చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు సంవత్సరముల ఇబ్బందుల నుండి ఎట్టకేలకు విముక్తి పొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. హాస్పిటల్ లో ఉన్నంత కాలం మంచి వైద్య సేవలు అందించిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సేవలను అందించే సిబ్బందితో పాటూ సాధారణ ప్రజలు కూడా DUNBAR’s సిండ్రోమ్ అనబడే అరుదైన ఆరోగ్య సమస్యపై అవగాహన పెంచుకొని తద్వారా వ్యాధిని సరైన సమయంలో గుర్తించడం ద్వారా తక్కువ గాయాన్ని కలిగిస్తూ త్వరగా కోలుకోవడానికి ఆస్కారం కలిగించే లాప్రొస్కోపిక్ శస్త్ర చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.