సీఎం జగన్ తో శిద్ధా భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా సుధీర్ లు కలిశారు. అమరావతి సచివాలయంలోని సీఎం కార్యాలయంలో వారిద్దరూ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో రాజకీయాలు, శిద్దా నిర్వహించాల్సిన పాత్రపై చర్చకు వచ్చినట్టు సమాచారం. శిద్దా సేవలను వినియోగించుకునే విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.