ap news

ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రజారోగ్య లేబరేటరీలు

– 13 ప్రాంతీయ ఆసుపత్రుల్లో త్వరలో కొత్త సమీకృత ప్రజారోగ్య లేబరేటరీలు

– కమ్యూనికబుల్, నాన్- కమ్యూనికబుల్ చెందిన 134 రకాల పరీక్షలు

– రూ.16.25 కోట్ల వరకు వ్యయం!

– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి

రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటవుతున్న ఈ లేబరేటరీ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలు) మార్చి/ఏప్రిల్ నాటికి వినియోగంలోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.నిర్మాణల పూర్తికి తగ్గట్లు లేబరేటరీలకు యంత్రాలు / పరికరాలు సరఫరా అవుతున్నాయని మంత్రి నేడొక ప్రకటనలో తెలిపారు. సంక్రమిక (కమ్యూనికబుల్), అంసక్రమిక (నాన్-కమ్యూనికబుల్) కేటగిరిలకు సంబందించిన మొత్తం 134 రకాల పరీక్షలు ఈ లేబరేటరీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అసుపత్రుల్లో ఉన్న ల్యాబ్ లు ఐపీహెచ్ఎల్ రాకతో మరింత బలోపేతమవుతాయని, అత్యాధునిక యంత్రాల ద్వారా నమూనాల పరీక్షల ద్వారా జరుగుతాయన్నారు. పరీక్షల నాణ్యత పెరుగుతుందన్నారు. సదరు ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల పీహెచ్సి, ఇతర ఆసుపత్రుల నుంచి రోగులను ఇక్కడికి రిఫర్ చేస్తారు దీనివల్ల రోగులకు దూరాభారం తగ్గుతుంది, తక్కువ వ్యవధిలో సదరు ప్రాంతాల్లోని రోగాల తీవ్రత, వ్యాప్తికి దారితీసిన కారణాలను గుర్తించడమే కాకుండా రోగులకు అందించే వైద్య సేవల్లో మరిన్ని జాగ్రత్తలు , అదనపు చర్యలు తీసుకోవడానికి, సదరు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యానికి ఈ లేబరేటరీలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు పశు సంవర్ధక శాఖ, నీటి పారుదల, పర్యావరణ వాతావరణ. ఆటవీ, ఇతర శాఖల వారితో (అవుట్ బ్రేక్స్, తదితర) సమన్వయానికి ఈ లేబరేటరీలు ఉపయోగపడతాయని వివరించారు.

ఆసుపత్రుల వివరాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, అనంతపురం జిల్లా గుంతకల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, పల్నాడు జిల్లా నరసరావుపేట, విశాఖ జిల్లా అగనంపూడి, నంద్యాల జిల్లా బనగానపల్లి, బాపట్ల జిల్లా చీరాల, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రుల్లో ఈ లేబరేటరీలు దాదాపుగా నిర్మాణాలు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా తుని, నెల్లూరు జిల్లా గూడూరు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఆసుపత్రుల్లో ల్యాబ్స్ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం ల్యాబ్ వంటిచోట్ల వచ్చిన పరికరాలు/యంత్రాలకు అనుగుణంగా పరీక్షలు కూడా చేస్తున్నారు.

అత్యాధునిక యంత్రాలు- కీలక పరీక్షలు
మైక్రో బయాలజీ, హెమటాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథాలజీ, మాలిక్యులర్ బయోలజీ ఇతర విభాగాల పరీక్షలు వీటిల్లో జరుగుతాయి. కార్డియాక్ మార్కర్స్ క్యాన్సర్ మార్కర్స్, ఐరన్ స్టడీస్, హార్మోన్, విటమిన్ వంటి పరీక్షలు. వీటిల్లో జరుగుతాయి. నీటి నమూనాల ద్వారా కలుషిత స్ధాయిని సూక్ష్మ స్ధాయిలో గుర్తించేందుకు పరీక్షలను కూడా ఈ ల్యాబ్స్ లో చేస్తారు. అత్యాధునిక బయోసేఫ్టి క్యాబినెటు క్లాస్-2 , సెల్ కౌంటర్ ఆటోమేటిక్ (5 పార్టు) ఫర్ హెమటాలజీ ఫుల్ ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, అటోమేటెడ్ హార్మోన్ ఎనలైజర్ (క్రియా ఎనలైజ్డ్), సెమీ ఆటోమేటడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, ఎలక్ట్రో ఎనలైజర్, మైక్రోటోమ్ వంటి అత్యాధునిక పరికరాలు ఐపీహెచ్ ల్యాబ్లో ఉంటాయి. ఈ అత్యాధునిక యంత్రాల ద్వారా హెచ్ఐవి నిర్ధారణ, హెపటైటిస్, క్షయ వంటి జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన పరీక్షలు కూడా వీటిల్లో జరుగుతాయి. పీఎం అభిమ్ కింద ఒక లేబరేటరీ నిర్మాణం, పరికరాల ఏర్పాటుకు కలిపి రూ. 1.25 కోట్ల చొప్పున ఈ 13 లేబరేటరీలకు కలిపి మొత్తం రూ.16.25 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *