జాషువా కాలనీలో మొక్కలు నాటిన ప్రముఖులు
ఒంగోలులోని పున్నమి హాస్పిటల్స్ సహకారంతో నెహ్రు యువజన కేంద్రం మాజీ కోఆర్డినేటర్, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని గుర్రం జాషువా కాలనీ లో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వైసీపీ యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఎంపీపీ పలపర్ల మల్లికార్జునరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్లు బి.నరసయ్య ,కృష్ణ లత, సుందరరామిరెడ్డి, ప్రముఖ డాక్టర్ జయ శేఖర్, వంశీకృష్ణ , హైదర్ క్లబ్ సెక్రటరీ వెంకటరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్ర భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
