ఒంగోలుకు వచ్చిన రాంగోపాల్ వర్మ
తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు
చంద్రబాబు, పవన్ ఫొటోల మార్పింగ్ పై కేసు నమోదు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో ఒంగోలు తాలూకా సీఐ శ్రీకాంత్ బాబు ఆయనను ప్రశ్నించారు. గతంలో ఆయన వ్యూహం సినిమా తీశారు. .ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ ల పొటోలను మార్ఫింగ్ చేసినట్టు మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం నవంబర్ 10న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న కూడా రామ్గోపాల్వర్మను ఒంగోలు తాలుకా పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గతంలో తాను ఫోన్ లేకుండానే వచ్చానని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ సారి మాత్రం ఆయన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రశ్నించారు. వ్యూహం సినిమా నిర్మాణం వెనుక ఎవరున్నారు.. మార్ఫింగ్ ఫొటోల ద్వారా చంద్రబాబు, పవన్ లను కించపరచటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి.. చేకూరిన ప్రయోజనం ఏమిటన్న విషయాలను రాంగోపాల్ వర్మ వద్ద నుంచి రాబట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.