చంద్రబాబుతో సచిన్ టెండూల్కర్ భేటీ

కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పార్టీ ఎంపిలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపిలతో ఎయిర్ పోర్టు లాంజ్ లో సీఎం కొద్ది సేపు సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి జన్ పథ్ లోని తన నివాసానికి వెళ్లారు.

