ap news

మెడికల్ సీట్లలో ఎన్ సీసీ కోటా రద్దు పునరుద్ధరించాలి

 

400 సీట్లు రద్దు

మెడికో విద్యార్థుల ఆందోళన

రెడ్ ఫ్లాగ్ మద్ధతు

గతంలో అమలైన ఎన్ సిసి కోటా ప్రకారం మెిడికల్ సీట్లు కొనసాగించాలని  యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) ఏపీ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ తో, జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెడికల్ సీట్లు, మెడికల్ విద్య వ్యాపరమయం చేసి, కోట్లు ఉన్న వారికి సీట్లు అనే వ్యాపార ధృక్పథం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని అన్నారు. ఎన్ న్ సిసి కోట ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి, వారి కోటకు చెందిన 400 వారికే రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థుల ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటీస్తామని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఇదీ విషయం..

ఈ సంవత్సరం నీట్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులకు నిరాశ మిగిలింది. ఎన్ సిసి కోటాలో సీటు వస్తుందని ఆశతో నీట్ ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 సీట్లు గల్లంతయ్యాయి. ఎన్ సిసి కోటాను రద్దు చేశారు. అందువల్ల ఎన్ సిసి సర్టిఫికెట్ ఉన్న 400 మంది విద్యార్థుల ఆశలు నిరాశైయ్యాయి. వేడుకో విద్యార్థుల కౌన్సిలింగ్ వెబ్ సైట్ లో ఈ అంశాలు పొందుపరిచారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన గురయ్యారు. ఎన్ సిసి సర్టిఫికెట్ల ధ్రువీకరణల ఆధారంగా సి సర్టిఫికెట్ కు ఒక్క శాతం, బి సర్టిఫికెట్ కు రెండు శాతం, ఏ సర్టిఫికెట్ కు మూడు శాతం చోప్పున మార్కులు మాత్రం కలుపుతారని అంటున్నారు. అంతేగాని ఎన్ సిసి కోటాలో ఉన్న 400 సీట్లు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళపనకు గురౌతున్నారు. ఆ కోటాలో సీటు వస్తుందన్న ఆశతో ఉన్న ఎన్ సిసి విద్యార్థులు ఆందోళన బాట పట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *