ap news

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత

డీజీపీ హరిష్ కుమార్ గుప్తాతో పాటు ఇతర ఉణ్నతాధికారులతో భేటీ అయిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి,10 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో మంగళవారం అసెంబ్లీలో పోలీస్ అధికారులతో శాంతి,భద్రతల ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డి.జి.పి.హరీష్ కుమార్ గుప్తను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని,వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అంతేగాక అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార,సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు  పోలీస్ అధికారులకు సూచించారు.
ఈసమావేశంలో ఉప సభాపతి కె.రఘురామ కృష్ణ రాజు,డిజిపి హరీశ్ కుమార్ గుప్త, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *