జగన్ కు కంది రవిశంకర్ స్వాగతం

ఒంగోలులోని టీవీఎస్ షోరూం, రవి ప్రియా మాల్ అధినేత, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కంది రవిశంకర్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరయిన జగన్ కు ఆయన శాలువ కప్పి స్వాగతం పలికారు. సీఎం వెంట వెళ్ళి నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని ఇతర శాసనసభ్యులు, సీనియర్ నేతలు ఉన్నారు.