నిర్భంధ చట్టాలకు వ్యతిరేకంగా 12న ధర్నాలు

16న కార్పొరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు
మాజీ మంత్రి, ఎస్ కెఎం కన్వీనర్ వడ్డే
విజయవాడ: రాష్ట్రంలో తెలుగు దేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్భంధ చట్టాలకు వ్యతిరేకంగా 12న రాష్ట్ర వ్యాపితంగా జిల్లా కలెక్టర్ ల ముందు ధర్నాలు చేపట్టాలని మాజీ మంత్రి, ఏపి ఎస్ కెఎం కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాడే శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడంతో ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు అద్దం పట్టిందన్నారు. 19 కేసులు ప్రజాసమస్యలపై పని చేసిన కేసులేనన్నారు. 13 కేసులు కొట్టివేసారన్నారు. 4 కేసులు ఇంకా పరిశోధనలోనే ఉన్నాయన్నారు. అనకాపల్లి విట్టల్ ఐరన్ కంపెనీకి, బల్క్ డ్రగ్ కంపెనీకి రైతుల భూములు కట్టబెడ్డాన్ని తాను, అప్పరాజు, పలు రైతు సంఘాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. హోమంత్రి అనిత ప్రాతినిధ్యం వ్యవహారిస్తున్న జిల్లాలో ఆమెకు అంతా నిరసన సెగ తట్టకోలేక, కార్పొరేట్ లకు రైతుల భూములు కట్టబెట్టేందుకు, వారి మెప్పు పొందేందుకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంఘం నాయకుడు అప్పలరాజు పై పిడి యాక్ట్ పెట్టారని విమర్శించారు. ఏఐఏస్ఎఫ్, ఏఐవైఏఫ్ నాయకులపై రౌడీ షీట్లు పెట్టాడం రైతుల భూములను కార్పొరేట్ లకు అనుకూలంగా వ్యవహారించటమేనన్నారు. వారిపై కేసులు పెట్టి ఇతర ఉద్యమించే వారిని బెరించటమేనన్నారు. 16 న దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మండల కేంద్రాలలో నిరసన వ్యక్తం చేయాలన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఛైర్మెన్ కామన ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కోనసాగించాలన్నారు. నూతన చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనుకూల చట్టాలను రూపొందిస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం గెలిచిన దాఖలాలేన్నారు.
జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ విబి జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. 2025 విత్తన చట్టాన్ని, విద్యుత్ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కె. వి. వి. ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్భంధన్నికి వ్యతిరేకంగా 12 న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించలన్నారు. 14న అన్ని చట్టాల జీఓలను బోగీ మంటాల్లో దగ్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు కెపోలారీ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షలు యు. వీరబాబు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఏఐకెఏంఏస్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎస్ వివి సత్యనారాయణ, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐకెఏఫ్ నాయకులు కాసాని గణేష్ బాబు, ఏఐసిటియు రాష్ట్ర నాయకులు లక్ష్మినరసింహారావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు ఎఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తొలుత రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల సమావేశం మాజీ మంత్రి, ఏపి ఎస్కెఎం కన్వీకర్ వడ్డే శోభనాధీశ్వరరావు అధ్యక్షతన జరిగింది.
