ap news

రాయలసీమలో ఏబీ వెంకటేశ్వరరావు పర్యటన

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొజ్జా దశరధరామిరెడ్డి

ఈనెల 5,6న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన 
రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్,
సాగునీటి రంగ విశ్లేషకుడు తుంగ లక్ష్మినారాయణ,
సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావులతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై పరిశీలన
వివరాలు వెల్లడించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా

ఆలోచనా పరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏ.బి వెంకటేశ్వరరావు

రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపీఎస్ అదికారి ఏ.బి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్, సాగునీటి రంగ విశ్లేషకుడు తుంగ లక్ష్మినారాయణ, సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావులు ఈనెల 5,6న పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయర్, గోరకల్లు, అలగనూరు, సుంకేసుల బ్యారేజ్ లను సందర్శిస్తారని రాయలసీమ సాగునీటిసాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి తెలిపారు. 6న మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలులోని ఎస్టీయు భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నుండి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుని పోవడానికి అవసరమైన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయినప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం 12 నుండి 15 వేల వేల క్యూసెక్కుల నీరు కూడా రావటం లేదన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేస్తున్న 35000 వేల క్యూసెక్కులలో 20 వేల క్యూసెక్కుల నీరు కుందూ నది ద్వారా నెల్లూరు వైపు సముద్రాన్ని చేరడానికి ఉరకలు వేస్తున్నాయని అన్నారు.వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పాలకులు మాత్రం..‘ఒక నెలరోజుల ముందే నీటిని విడుదల చేశాం.. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నాం‘ అంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలిస్తూ శ్రీశైలం రిజర్వాయర్ అంతా ఖాళీ చేస్తున్నారన్న తెలంగాణ నాయకులు చేస్తున్న అవాస్తవ ప్రకటనలను సాకుగా చూపించి కరవు ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని బొజ్జా ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వై.ఎన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యుడు చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, న్యాయవాది అసదుల్లా, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, రాఘవేంద్ర గౌడ్, మహమ్మద్ పర్వేజ్, పట్నం రాముడు, జానో జాగో నాయకులు మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *