Prakasam

హితుడా..వెళ్ళిపోయావా..శోకసంద్రమైన బాలినేని

కడసారి తన అనుచరుడిని చూసి కన్నీరు మున్నీరవుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి

కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన వైఎస్ఆర్ సీపీ యువనాయకుడు శింగరాజు వెంకట్రావు మృతితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. తనకు ప్రధాన అనుచరునిగా ఉన్న వెంకట్రావు మృతిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఒంగోలు బండ్లమిట్టలో మంగళవారం వెంకట్రావు భౌతిక కాయానికి నివాళి అర్పిస్తూ బాలినేని శోక సంద్రమయ్యారు. కడసారి తన అనుచరుడి భౌతిక కాయాన్ని స్పృశిస్తూ భోరున విలపించారు. తీవ్రమైన విషాదంలో శోకసంద్రమైన బాలినేనిని చూసి ఆయన అనుయాయులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. బాలినేని సతీమణి శచీదేవి కూడా కంటనీరు పెట్టుకున్నారు. శింగరాజు వెంకట్రావు ఎంతో చురుగ్గా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో బాలినేని కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఒక దశలో జైలుకు కూడా వెళ్ళారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వెంకట్రావు సతీమణికి ఒడా చైర్మన్ పదవి ఇచ్చారు. కొంతకాలంగా వెంకట్రావు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

శింగరాజు వెంకట్రావు భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి

మాగుంట నివాళులు

శింగరాజు వెంకట్రావు భౌతిక కాయానికి మాగుంట శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. యుక్త వయసులోనే వెంకట్రావు మృతి చెందటం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, కుటుంబసభ్యులు కష్టకాలాన్ని మనో నిబ్బరంతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *