Prakasam

ఒంగోలులో మంత్రి శ్రీను కార్యాలయం

ప్రారంబోత్సవానికి హాజరైన సన్నిహితులు.. 

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు

ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు నూతన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న గుప్తా మిడ్ టౌన్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆయన తన వ్యక్తిగత కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన సన్నిహితులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రి సొంత కార్యాలయం ప్రారంభించటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్న చర్చ మొదలైంది.

మంత్రి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు చెబుతున్న టీడీపీ మహిళా నేతలు
ఒంగోలు నగరా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు , ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు, కరాటే కోచ్ మోహన్ రావులు శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యం
మంత్రి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు చెబుతున్న మితృలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *