జనార్దన్..దేవుడి ముందు ప్రమాణం చేస్తావా..!

దామచర్ల జనార్దన్ పై ధ్వజమెత్తిన బాలినేని

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒంగోలులో పేదలకు ఇళ్ళు రాకుండా తెరవెనుక ఉండి కోర్టులో కేసులు పెట్టించావ్..అనుమతుల్లేకుండానే టిడ్కో ఇళ్ళ పేరుతో డబ్బులు కట్టించుకుని వేలాదిమందిని మోసం చేశావ్..బ్యాంకుల వద్ద కోట్లాది రూపాయల అప్పులు తీసుకుని వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఆస్తులు కూడబెడుతున్నావ్..అప్పులిచ్చినోళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నా ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేస్తున్నావ్.. పేదలకు ఇళ్ళు రాకుండా కోర్టులో కేసులు దాఖలు చేయించలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తావా..నేను కూడా వస్తాను..నీవు ఇష్టపడే ఏ దేవుడి వద్దనైనా ప్రమాణం చేయ్.. వ్యక్తిగత విషయాల జోలికి వద్దనుకున్నా అనవసరంగా రెచ్చగొడుతున్నావ్ అంటూ బాలినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *