బోరుగడ్డ అనిల్..నీకు ఒంగోలు సత్తా చూపిస్తా..!

నెల్లూరులో కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డిని కలిసి మద్దతు ప్రకటిస్తున్న సుబ్బారావు గుప్తా

హెచ్చరించిన సుబ్బారావు గుప్తా 

కోటంశ్రీధర్ రెడ్డిని కలిసి మద్దతు 

ఇటీవల అధికార పార్టీని ధిక్కరించి సంచలనం సృష్టిస్తున్న నెల్లూరు రూరల్ వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో  సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆదివారం భేటీ అయ్యారు. నిరంకుశత్వంపై కోటంరెడ్డి పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా గుప్తా అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని దూషిస్తూ మాట్లాడటం తగదని హితవు పలికారు. బోరుగడ్డ అనిల్  టిక్ టాక్ చేసుకుంటూ వీడియోలు చేసే బచ్చా..అతనికి  కోటంరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. కోటంరెడ్డి అనుమతి ఇస్తే అనిల్ కి ఒంగోలు వాళ్ళ సత్తా ఏంటో రుచి చూపిస్తానని హెచ్చరించారు. త్వరలో ఆనం వివేకానంద రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి తదితర రెబల్ నాయకులను కలిసి మద్దతు ప్రకటిస్తున్నట్లు గుప్తా తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *