మంత్రుల సింగపూర్ పర్యటన.. జేటీసీ కార్పొరేషన్ పై అధ్యయనం

సింగపూర్‌ లో 3 వ రోజు శిక్షణ కార్యక్రమంలో JTC కార్పొరేషన్ పై మంత్రులు అధ్యయనం
సింగపూర్ వాణిజ్య,  పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రభుత్వ సంస్థ JTC కార్పొరేషన్ (గతంలో జురాంగ్ టౌన్ కార్పొరేషన్) ను సందర్శించిన మంత్రుల బృందం
పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్‌లను నిర్మించడం, పర్యావరణానికి అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన JTC కార్పొరేషన్
సంస్థ పురోగతిని ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించిన JTC రిటైర్డ్ అసిస్టెంట్ సీఈవో సీ కీ పోక్ (Seah Kee Pok)
సింగపూర్ లో అధ్యయన పాఠాలు వింటున్న మంత్రులు
సింగపూర్‌లో కీలక ప్రాజెక్టులు జురాంగ్ ఐలాండ్ (Jurong Island), వన్-నార్త్ (one-north), చంగీ బిజినెస్ పార్క్ & పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్ వంటి భారీ ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన JTC కార్పొరేషన్ పనితీరు, కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న మంత్రులు
ఆగ్నేయాసియాలోనే మొదటిదైన జురాంగ్ రాక్ కేవర్న్స్ (చమురు నిల్వ కోసం భూమి లోపల నిర్మించిన గుహలు) వంటి వినూత్న నిర్మాణాలను చేపట్టిన సంస్థ JTC కార్పొరేషన్
ఏపీలో సైతం ఈ తరహాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి, స్మార్ట్ ఎస్టేట్‌ల నిర్మాణం, గ్రీన్ ప్రాజెక్టులను అమలు చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసిన మంత్రులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పి. నారాయణ, బి.సి. జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *