ఒంగోలుకు స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్, కాలేజీ, స్టేడియం లేనట్టేనా..!
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్, కాలేజీ, స్టేడియం ఇంకా లేనట్లే నా అంటలూ ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రకాశం జిల్లా క్రీడలకు చాలా ప్రసిద్ధి చెందింది .చాల మంది క్రీడాకారులు జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అయితే రాష్ట్ర స్ధాయి క్రీడా స్టేడియం లేకపోవడం జిల్లా కి అవమానకరం. 1987 ,2015 సంవత్సరంలో ఒక ప్రయత్నం జరిగింది కానీ స్ధలం సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ పరిధి లో పట్టణం అభి వృద్ధి చెందుతుంది అందులో భాగంగా కొత్త పట్నంలో 60 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నట్లు మాజీ జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారు ప్రకటించారు తరువాత ఒంగోలు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రజర్ల గ్రామంలో అని మళ్లీ ప్రకటించారు. కానీ కోర్టు సమస్యల వల్ల కథ మళ్ళీ మొదటికొచ్చింది.
గతంలో రాష్ట్ర క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం జిల్లా క్రీడా మైదానం కోసం 40 కోట్లు నిధులు మంజూరు చేయడానికి జీఓ కూడా ఇవ్వడం జరిగింది . ఇప్పుడు మళ్ళీ ఇంకో స్ధలం సేకరించి మళ్ళీ ఇంకో వైపు 60ఎకరాలు సేకరించి పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని క్రీడాకారులు , ప్రకాశం జిల్లా ప్రజలు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటలి సమాచారం లేకపోవటంతో త్రిబుల్ ఐటి లాగ ఇది కూడ వేరే ప్రాంతానికి తరలిపోవడ..లేకపోతే ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రకాశం జిల్లా ప్రజలు, క్రీడాకారులు ఆందోళన చెందుతారని కొల్లా మధు తెలిపారు.